HNK: నేరాల నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం కీలకమని శాయంపేట సీఐ సుధాకర్ రెడ్డి అన్నారు. ఇవాళ శాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాధాన్యం, అవి పనిచేసే విధానంపై ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.