BHPL: కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ ఛైర్మన్ మోహన్ శర్మ తనపై వచ్చిన ఆరోపణలను బుధవారం ఖండించారు. సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా అధికసంఖ్యలో సేవామహిళలు ఒకేసారి ఆలయంలోకి రావడంతో భక్తుల దర్శనాలకు అంతరాయం కలిగిందని తెలిపారు. పలుమార్లు సూచించినప్పటికీ వినకపోవడంతో పోలీసుల సహాయంతో వారిని బయటకు పంపినట్లు పేర్కొన్నారు. అంతే కానీ, మహిళలను అవమానించే ఉద్దేశం తమకులేదన్నారు.