MNCL: జన్నారం మండలంలో ఈదురు గాలులతో వచ్చిన భారీ వర్షానికి మామిడి తోటల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. జన్నారం మండలంలోని దేవునిగూడెం, ఇందన్ పల్లి, పైడిపల్లి, తదితర గ్రామాలలో మామిడి తోటలు ఉన్నాయి. ఆ తోటలను కొంతమంది రైతులు కౌలుకు తీసుకున్నారు. మంగళవారం వచ్చిన ఈదురుగాళ్లకు చెట్లకున్న మామిడి కాయలు మొత్తం రాలిపోయాయని మామిడి రైతులు మూదేళ్ల శంకర్ వాపోయారు.