CTR: పద్మిని ఏకాదశి సందర్భంగా బుధవారం పుంగనూరు మండల పరిధిలోని కృష్ణమరెడ్డి పల్లి సమీపానగల శ్రీకృష్ణుని మందిరంలో స్వామి వారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అర్చకులు స్వామివారి మూలవర్లను అభిషేకించి అలంకరించి ధూపదీప నైవేద్యం సమర్పించారు. శ్రీకృష్ణుని దర్శించుకున్న అనంతరం భక్తులు ఆలయ ఆవరణంలో తులసి మొక్కలను నాటారు.