AP: ప.గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వేసవి సెలవుల్లోనే పూర్తి విచారణ జరపాలని ఆలయ కమిటీ తరఫు న్యాయవాది కోరగా.. సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభమయ్యాకే విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ లోపు రాష్ట్ర ప్రభుత్వం సహా మిగిలిన ప్రతివాదులు కూడా కౌంటర్లు దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను జులై-13కి వాయిదా వేసింది.