ADB: ఇచ్చోడ మండలం ముఖారా(కే) గ్రామంలో తడి, పొడి చెత్తను ఇంటి వద్దే వేరు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తడి చెత్తను డ్రెయిన్ల మట్టితో కలిపి వర్మీ కంపోస్ట్ (సేంద్రియ ఎరువు)గా మారుస్తున్నారు. సర్పంచ్ గాయక్వాడ్ జైపాల్ ఈ ప్రక్రియను బుధవారం పరిశీలించారు. ఈ విధానం గ్రామ పరిశుభ్రతకు, వ్యవసాయానికి ఎంతో తోడ్పడుతుందని పేర్కొన్నారు.