SRD: విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద జూన్ 5వ తేదీన నిర్వహించే ర్యాలీ జయప్రదం చేయాలని విద్యా పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ కోరారు. సంగారెడ్డి లోని సంక భవనంలో పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యా రంగానికి ప్రభుత్వం 20% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.