SDPT: దుబ్బాక నియోజకవర్గంలోని ఏనుగుర్తి గ్రామంలో బుధవారం ఉదయం రైతు కమటం సత్యానంద్‌కు చెందిన పాడి ఆవు పిడుగు పాటుకు గురై మృతి చెందింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనతో రైతుకు సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరారు.