BDK: ఇల్లందు నూతన కూరగాయల మార్కెట్ గదుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని స్థానిక వ్యాపారి దేవిశెట్టి రమేష్ ఆరోపించాడు. గత 30 ఏళ్లుగా కూరగాయల వ్యాపారం చేస్తున్న తనను పక్కనపెట్టి అర్హత లేని వ్యక్తికి షాపు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశాడు. రాజకీయ ఒత్తిళ్లతో గదుల కేటాయింపులు జరిగాయని ఆరోపిస్తూ, దీనిపై సీఎం, కలెక్టర్ సహా పలువురు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.