W.G: సీఎం సహాయనిధి పేదల పాలిట వరమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. బుధవారం భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో 58 మంది లబ్ధిదారులకు రూ. 25,63,245 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గడిచిన 20 నెలల్లో భీమవరం నియోజకవర్గంలో ఇప్పటివరకు 816 మందికి రూ. 6,35,66,244 లబ్ధి చేకూర్చామని తెలిపారు.