WGL: తెలంగాణ ప్రజా ప్రభుత్వం దేవాదాయశాఖ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. హైదరాబాదులో నేడు 12 మంది మాజీ అర్చక ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ‘అర్చక సంక్షేమ నిధి’ నుంచి రిటైర్మెంట్, డెత్ గ్రాట్యుటీ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. దేవాలయాల అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అన్నారు.