TG: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు సీఎం రేవంత్ లేఖ రాశారు. తుమ్మడిహెట్టి బ్యారేజ్ ఎత్తు పెంపుపై మరోసారి సమీక్షించాలని కోరారు. తెలంగాణ ప్రతినిధులకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉత్తర తెలంగాణ అవసరాలకు సరిపోదని తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా ఎత్తుపై మళ్లీ చర్చ అవసరమని సీఎం లేఖలో పేర్కొన్నారు.