AP లిక్కర్ స్కామ్‌లో ఏ2గా ఉన్న దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ఇవాళ ED విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ బహీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో నాలుగు గంటల పాటు ఆయన్ను అధికారులు ప్రశ్నించారు. ఇదే కేసులో నిన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి భార్య, కుమారుడు ఈడీ విచారణకు హాజరై ఆర్థిక లావాదేవీలు, ఆస్తులకు సంబంధించిన వివరాలను అధికారులకు అందజేశారు.