PDPL: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు అర్హులైన బాలబాలికలు జూలై 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాలరావు ఇవాళ తెలిపారు. ఆవిష్కరణ, సృజనాత్మకత, పర్యావరణం, క్రీడలు తదితర రంగాలలో ప్రతిభ చూపిన 18 సం. లోపు వారు http:awards.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9966676181 నంబర్‌ను సంప్రదించవచ్చన్నారు.