NGKL: జిల్లాలో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన బకాయి జీతాలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ 104 ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు అధికారులకు వినతిపత్రం అందించారు. సకాలంలో వేతనాలు రాకపోవడంతో తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి తమ కుటుంబాలను ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు.