AP: చంద్రబాబు హయాంలో BC, SC, STలు మోసపోయారని మాజీ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. జగన్ చేసిన సంక్షేమంపై తాము ఎక్కడైనా చర్చకు సిద్ధమని.. డేట్, టైమ్, ప్లేస్ చెప్పాలని TDP నాయకులకు సవాల్ విసిరారు. జగన్ను మళ్లీ సీఎం చేసేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. బలహీన వర్గాలంతా జగన్ వెంటే ఉన్నారని.. వారికి అండగా నిలిచింది తమ అధినేత మాత్రమే అని అన్నారు.