SDPT: రైతుల పేరుతో రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సిద్దిపేట ఆత్మ కమిటీ ఛైర్మన్ పూజల గోపికృష్ణ BRS నేతలు హరీష్ రావు, బాల్క సుమన్‌పై మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని పరోక్షంగా ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. వీరిని సంఘ విద్రోహ శక్తులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు.