సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట్ ప్రధాన రహదారి పక్కన మంచినీటి పైప్లైన్ బుధవారం రాత్రి లీకేజ్ అయింది. 2 గంటలకు పైగా లీకేజీతో ప్రధాన రహదారిపై నీరు చేరి వాహనదారులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.