NZB: జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని బూత్ అధ్యక్షులు, ముఖ్య నాయకుల సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం ఆర్మూర్ లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ మాజీ MLA జీవన్ రెడ్డి అధ్యక్షత వహించారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గల్లీ గల్లీలో “మళ్లీ కారే కావాలి.. KCR కావాలి” అనే నినాదం వినిపిస్తోందన్నారు.