HYD: ఆన్లైన్ జ్యోతిష్యం, తంత్ర సేవల పేరుతో జరిగే సైబర్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్లో వచ్చే వశీకరణ, పూజల ప్రకటనలను నమ్మి అపరిచితులకు డబ్బులు పంపవద్దని సూచించారు. వ్యక్తిగత వివరాలను అస్సలు పంచుకోవద్దన్నారు. ఒకవేళ మోసపోతే బాధితులు వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలన్నారు.