BPT: జిల్లా పౌర సరఫరాల శాఖ నూతన అధికారిగా ఏ. జగన్మోహన్ రావు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులందరికీ పారదర్శకంగా అందేలా తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. విధుల పట్ల నిబద్ధతతో పనిచేస్తానని నూతన అధికారి తెలిపారు.