MLG: జిల్లా ముస్లిం సోదరీ సోదరులకు మంత్రి సీతక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, ఐక్యతకు ప్రతీకైన ఈ పండుగ ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. సమాజంలో సామరస్యం, సౌభ్రాతృత్వం వర్ధిల్లాలని, అందరి జీవితాల వెలుగులు నింపాలని మంత్రి ఆకాంక్షించారు.