AKP: ఎస్.రాయవరం మండలం ధర్మవరం అగ్రహారంలోని దుర్గాదేవి ఆలయ వార్షికోత్సవ సందర్భంగా బుధవారం ఉదయం సప్తహ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వచ్చే నెల 3వ తేదీ వరకు వారం రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. స్థానిక భక్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి హరి భజన బృందాలు వచ్చి భక్తి కీర్తనలు ఆలపిస్తూ భజనలు చేస్తారని పేర్కొన్నారు.