NDL: బీ. తాండ్రపాడు ప్రభుత్వ మైనార్టీ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 30న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి దీప్తి బుధవారం వివరించారు. ఏపీఎస్ఎస్ఈసీ ఆధ్వర్యంలో జాబ్ మేళాలో 10 కంపెనీలు పాాల్గొంటాయని పేర్కొన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగిన 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు హాజరుకావచ్చని ఆమె వెల్లడించారు.