BPT: వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ బచ్చులువారిపాలేనికి చెందిన రహమతుల్లా వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయాడు. అతనికి భార్య, కుమారుడు ఉన్నారు. భార్య దివ్యాంగురాలు కావడంతో కుటుంబ భారం మొత్తం అతడిపైనే ఉండేది. ఇప్పుడు ఆధారాన్ని కోల్పోయిన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.