ASR: సంతబయలు వీధిలో బుధవారం డీఎల్పీవో పీఎస్ కుమార్ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ పథం’ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ నిశాంతి, పరిషత్ సీఈవో నారాయణమూర్తి పాల్గొన్నారు. స్వచ్ఛ పథం అనేది ప్రతి బుధవారం నిర్వహించే నిరంతర పారిశుద్ధ్య ఉద్యమమన్నారు. పంచాయతీల్లో రోడ్ల పక్కన చెత్తను తొలగించి, గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడమే దీని ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ అన్నారు.