PPM: సాలూరు రూరల్ CI రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పాచిపెంట మండలం గడివలసలో స్దానిక SI అర్జున్ విలేజ్ విజిటింగ్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాలలో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పడానికి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజలు స్నేహ పూర్వకంగా మెలగాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే సైబర్ నేరగాళ్లు పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.