JN: మున్సిపాలిటీలో ఆసరా పెన్షన్ లబ్ధిదారుల కోసం లైవ్ ఆథెంటికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు వార్డులలో ఆధార్ వెరిఫికేషన్, లైవ్ ఫోటో నమోదు చేపడుతున్నారు. 7వ వార్డులో ప్రత్యేక బృందం ప్రక్రియ నిర్వహిస్తోంది. ఇంకా వెరిఫికేషన్ చేయించుకోని లబ్ధిదారులు వెంటనే పూర్తి చేసుకోవాలని, లేకపోతే పెన్షన్ నిలిచిపోతుందన్నారు.