సిరిసిల్ల ఐడీవోసీలో మహిళా సంక్షేమ వారోత్సవాల సందర్భంగా పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం- 2013పై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ గరిమ అగ్రవాల్ పాల్గొని మాట్లాడారు. మహిళలు స్వేచ్ఛగా, నిర్భయంగా పని చేసే వాతావరణం కల్పించడం ప్రతి కార్యాలయ అధిపతి బాధ్యత అని అన్నారు.