భారత దిగ్గజ షూటర్ రాజా రణధీర్ సింగ్ (79) కన్నుమూశాడు. ఆసియా క్రీడల్లో దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించిన ఆయన, గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తన స్వగృహంలో తుదిశ్వాస విడిచాడు. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఇటీవల ఆయన ఆసియా ఒలింపిక్ మండలి అధ్యక్ష పదవి నుంచి వైదొలిగాడు. రణధీర్ సింగ్ మరణం పట్ల భారత క్రీడాలోకం, షూటర్లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.