MNCL: చెన్నూరులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రైల్వే ఆస్తుల ధ్వంసానికి పిలుపునివ్వడం బాధ్యతారాహిత్యమని, మిలిటెంట్ ఉద్యమాల పేరుతో యువతను తప్పుదోవ పట్టించడం సరికాదని అన్నారు. ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.