TG: తాను సింగరేణి, రైతుల సమస్యల తీవ్రతను తెలిపేలా మాట్లాడినట్లు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పేర్కొన్నారు. తన మాటల్లో స్ఫూర్తిని తీసుకోవాలి కానీ.. వివాదాన్ని కాదన్నారు. డైవర్ట్ చేయడానికే తన వీడియోను వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. ‘పొన్నం ఎప్పుడు అశోక్‌నగర్‌కు వస్తారో చెప్పాలి. డేట్, టైమ్ చెబితే నేను కూడా వస్తా’ అని సవాల్ విసిరారు.