రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘కాక్టెయిల్ 2’. హోమీ అదజానియా తెరకెక్కిస్తున్న ఈ మూవీ జూన్ 19న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారట. మే 29న ట్రైలర్‌ను రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.