NGKL: నాగర్ కర్నూల్ నుంచి నాగనూలు వెళ్లే ప్రధాన రహదారి పక్కన చెత్తకుప్పలు పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్త సేకరణకు మున్సిపల్ ఆటోలు ఉన్నప్పటికీ, కొంతమంది వ్యర్థాలను నడిరోడ్డుపైనే పారబోస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడ పందులు, వీధి కుక్కలు చేరి ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.