ఆమనగల్ మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సమావేశంలో మున్సిపాలిటీ అభివృద్ధి అంశాలపై వైస్ చైర్ పర్సన్ తల్లోజు గీత ఆచారి చర్చించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్, ఛైర్మన్ పత్య నాయక్, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొని పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందించారు.