KRNL: తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి పార్టీకి భారీ విరాళం ప్రకటించారు. వీరిద్దరూ ఒక్కొక్కరు రూ.1 కోటి చొప్పున టీడీపీ పార్టీ నిధికి అందజేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పార్టీ అభివృద్ధి కోసం ఉదారంగా సహాయం చేసిన ఇద్దరు మంత్రులను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.