ADB: భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో చోటుచేసుకుంది. బరంపూర్ గ్రామానికి చెందిన అనితకు కజ్జర్ల గ్రామానికి చెందిన అమూల్‌తో గత నాలుగేళ్ల కిందట వివాహమైంది. వీరిద్దరి మధ్య గొడవలతో పుట్టింటికి వెళ్ళిన అనిత తిరిగి రాకపోవడంతో అమూల్ బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు SI రాధిక తెలిపారు.