VSP: రాష్ట్రంలో బీజేపీ, జనసేన మధ్య చిచ్చుపెట్టాలని మైండ్ గేమ్ ఆడుతున్నారని, ఆ ముసుగు వీరుల సంగతి తేలుస్తామని BJP పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. బుధవారం విశాఖలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ చేసిన పాపాలకు శిక్షలు తప్పవని, అరెస్ట్లు జరుగుతాయని అన్నారు. కూటమి ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.