PDPL: సుల్తానాబాద్‌లోని కలెక్టర్ శ్రీ హర్ష బుధవారం బాలసదనం, వృద్ధాశ్రమం, తహసిల్దార్ కార్యాలయాలను తనిఖీ చేశారు. ఈనెల 29న బాలసదనం ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వృద్ధాశ్రమంలో అందుతున్న వసతులు, ఆహారం, పరిశుభ్రతపై ఆరా తీశారు. తహసిల్దార్ కార్యాలయంలో పెండింగ్ దరఖాస్తులు పరిశీలించాలని, మధ్యవర్తులకు ఆస్కారం లేదని తెలిపారు.