HNK: విత్తన చట్టానికి విరుద్ధంగా విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కమలాపూర్ మండల వ్యవసాయ అధికారి వేణు అన్నారు. ఇవాళ మండలంలోని డీలర్లతో సమావేశం అయ్యారు. తప్పనిసరిగా రిజిస్టర్ నమోదు చేయాలని, అధిక ధరలకు విత్తనాలు, ఎరువులు అమ్మ వద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.