TG: మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ పర్యటించారు. ఈ సందర్భంగా టేకుమట్ల ఐకేపీ కేంద్రాన్ని పరిశీలించారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఈసారి పంట దిగుబడి ఎక్కువగా వచ్చిందని తెలిపారు. హమాలీలు, లారీల కొరతతో కొంచెం ఆలస్యం జరిగిందని చెప్పారు. లారీలు కావాలని సింగరేణి సంస్థకను కోరినట్లు మంత్రి వెల్లడించారు.