విజయనగరంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రమైన శ్రీ రామనారాయణంలో హస్త నక్షత్రం పురస్కరించుకుని శ్రీ విజయగణపతి స్వామికి పంచామృతాభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు అనిల్ కుమార్ ఆచార్యులు, కృష్ణ తేజ, రోహిత్ కృష్ణమాచార్యులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.