SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామ వీడీసీ సభ్యులు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలిసి రెండో వడ్ల కొనుగోలు కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మినీ బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. గంగమ్మ గుడి నుంచి కొత్త హనుమాన్ ఆలయం వరకు నిర్మించిన మూడు కిలోమీటర్ల ఫార్మేషన్ రోడ్డుకు సహకరించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.