KDP: మైదుకూరులో సీసీ కెమెరాల నిఘాతో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. బస్సుల్లో ప్రయాణికుల బ్యాగులు చోరీ చేసిన మహిళ వద్ద నుంచి రూ.15 లక్షల విలువైన 105 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మోటార్ సైకిళ్లు దొంగిలిస్తున్న మరో నిందితుడిని అదుపులోకి తీసుకుని రూ.5 లక్షల విలువైన 7 బైకులను రికవరీ చేశారు.