సత్యసాయి జిల్లాలోని ముస్లింలకు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, దాతృత్వానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో, సంతోషంగా సుహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ముస్లిం సోదర సోదరీమణులంతా సుఖసంతోషాలతో ఈ ఉత్సవాన్ని నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.