భారత మార్కెట్లో ఓక్టర్ కంపెనీ సరికొత్త ఏసీని ఆవిష్కరించింది. స్టూడియో ఏసీ 5000- 2026 పేరిట విడుదలైన ఈ మోడల్ ధర రూ.14,499కే వచ్చేస్తుంది. అయితే, GSTతో కలిపి రూ.16,999కు లభ్యమవుతుంది. ఇది 75 చదరపు అడుగుల్లోపు విస్తీర్ణం ఉన్న చిన్నపాటి గదికి సరిపోతుందని సంస్థ తెలిపింది. దీని వినియోగానికి గంటకు రూ.4 మేర విద్యుత్తు ఖర్చు అవుతుందని తెలిపింది.