SKLM: లావేరు శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరంలో బుధవారం విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారారు. 26 మంది విద్యార్థులు తాము నేర్చుకున్న పాఠాలు, పద్యాలను నల్లబల్లపై రాసి తోటి విద్యార్థులకు బోధించారు. గ్రంథాలయాధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. శిబిరంలో నేర్చుకున్న అంశాలను మళ్లీ విద్యార్థులతో బోధింపజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సహాయకులు వీరభద్రుడు ఉన్నారు.