AP: DSCలో అక్రమాలపై విచారణ జరిపించాలని మంగళగిరిలోని విద్యాశాఖ కార్యాలయం దగ్గర YCP నేతలు ఆందోళనకు దిగారు. MLAలు, MLCల ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పకపోవడంపై YCP నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేలపై కూర్చొని YCP MLCలు నిరసన తెలిపారు. DSCలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, దుష్ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని నిన్న AP విద్యాశాఖ హెచ్చరించింది.