NDL: నంది కొట్కూరు పట్టణంలో జీఓ.98 బాధితులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వారు చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి 63 రోజుకు చేరాయి. జీఓ.98 ప్రకారం బాధిత నిర్వాసితులకు, నాయకులు ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 674 సెకండ్ లిస్ట్ అప్రూవల్ చేసి బాధితుల పక్షాన నిలిచి, చరిత్రలో నిలిచిపోవాలని చెప్పుకొచ్చారు. అప్పుడే బాధితకు న్యాయం చేసిన వారు అవుతారని వారు అన్నారు.