కోనసీమ: రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురంలో క్లస్టర్-1, క్లస్టర్-2 ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న ‘మహానాడు’ పండుగ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తన స్వగృహం నుంచి సైకిల్ తొక్కుతూ మహానాడు వేదిక వరకు చేరుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన వెంట ఏఎంసీ ఛైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ ఉన్నారు.